ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో హెలికాప్టర్ వార్… అసలేం జరిగిందంటే?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెలికాప్టర్ వార్ నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఏపీలో కూటమి నేతలు ఇష్టం వచ్చినట్లుగా హెలికాప్టర్లను వాడుతున్నారని.. ఎవరబ్బ సొమ్మని ఇలా ఇష్టానుసారంగా వాడుతున్నారు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేసింది. కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విపరీతంగా హెలికాప్టర్లు వాడుతున్నారని ఫైర్ అయ్యింది. ప్రజల సొమ్మును ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ప్రయాణాలు చేయడమే సరిపోయిందని.. మీ వల్ల రాష్ట్రానికి రూపాయి లాభం లేదని… సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సిపి పార్టీ పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

Read also : రెండవ రోజు గాయత్రి రూపంలో అమ్మవారు దర్శనం

“కరో కరో జల్సా కరో.. మీ తండ్రి కొడుకులు ఇద్దరి పని బాగుంది. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు వేసుకొని షేర్ ఆటోల మాదిరి ఇష్టానుసారం షికారులు చేస్తున్నారు. ఒకవైపు రైతులు మరోవైపు విద్యార్థులు… అల్లాడిపోతున్న కూడా మీ జల్సాలకు మాత్రం లోటు లేదు. ఎవడబ్బ సొమ్మనీ ప్రత్యేక విమానాలలో ఏకంగా 70 సార్లు హైదరాబాద్ వెళ్లారు. తండ్రి కొడుకులు వల్ల రాష్ట్రానికి భారమే తప్ప పైస ప్రయోజనం లేదు ” వైసీపీ సంచలన ట్వీట్ చేసింది.

https://x.com/YSRCParty/status/1970039210129371235?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1970039210129371235%7Ctwgr%5Ef3079cc2d331c55a9ce493981948a67f2e840d2e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2ఫ్

అయితే ఈ విషయంపై తాజాగా మంత్రి నారా లోకేష్ తిరిగి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు. గత మీ ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా హెలికాప్టర్లు ఉపయోగించావో మాకు తెలుసులే అని లెక్కల్ని బయటపెట్టారు. దీంతో ఇరు పార్టీల మధ్య హెలికాప్టర్ వార్ నడుస్తుంది.

Red also : కేంద్రం ఆదేశాలను పాటించరా… ధరలను ఎందుకు తగ్గించలేదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button