
నల్లగొండ ప్రతినిధి, (క్రైమ్ మిర్రర్):- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ 2025 లో భాగంగా, సోమవారం నాగార్జున సాగర్ బుద్దవనాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. ప్రపంచ సుందరీమణుల సాగర్ సందర్శిస్తున్న సందర్బంగా, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.. ఈ భద్రతా దృష్ట్యా బాంబు స్కాడ్, డాగ్ స్కాడ్, ఏరియా డామినేషన్ బృందాల చేత విస్తృత తనిఖీలను జిల్లా పోలీసు యంత్రాంగం చేపడుతున్నారు.
నాగార్జునసాగర్ లో దాదాపు 1000 మంది సిబ్బందితో పటిష్ఠ బందోదుస్తుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.. ఎలాంటి అవాంచనీయా సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచ సుందరీమణుల సందర్శనలో భాగంగా బుద్దవనం ప్రాంతాలలో డ్రోన్లను నిషేదించినట్లు తెలిపారు. సోమవారం జరగబోయే కార్యక్రమంపై ఆయన ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.