
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు పలు జిల్లాలలో పిడుగులు మరియు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తాజాగా APSDMA అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక మిగతా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. నిన్న, మొన్నటి వరకు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ప్రకాష్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాబట్టి కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా తుఫాన్ ఎఫెక్ట్ తగ్గినప్పటికీ కూడా కొన్ని జిల్లాలు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే వాగులు మరియు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీని కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో నిన్నటి వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కానీ నేడు యధావిధిగా పాఠశాలలు తెరుచుకోనున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజల గుండెల్లో భయం పుట్టించిన మొంథా తూఫాన్ ప్రభావం ప్రస్తుతం పూర్తిగా తగ్గిందనే చెప్పాలి.
Read also : ఫర్టిలైజర్ షాప్ లో అర్ధరాత్రి దొంగతనం
Read also : చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. సెమీఫైనల్స్ లో అద్భుత విజయం
 
				 
					
 
						 
						




