
క్రైమ్ మిర్రర్, వికారాబాద్:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వికారాబాద్ లో మాత్రం మరో ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయాన్నే ఒక్కసారిగా వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలందరూ కూడా భయంతో వణికిపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయంతో పరుగులు తీయ సాగారు. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి… మరోవైపు ఈ భూ ప్రకంపనలు ఏంటి?.. అని అయోమయంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. భూ ప్రకంపనలకి తెలంగాణ ప్రజల్లో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఎక్కడ భూప్రకంపనలు వచ్చాయి?.. ఈ సమయంలో వచ్చాయి అనేది ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Read also: లైన్ మెన్ సాహసం.. అభినందించిన డిప్యూటీ సీఎం!
తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం కొద్ది సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఒకవైపు భారీ వర్షాలతో సతమతమవుతున్న ప్రజలకు ఉన్నట్టుండి భూమి కాస్త షేక్ అవడంతో చాలా కంగారు పడ్డారు. రెండు మూడుసార్లు అదేవిధంగా భూప్రకంపనలు రావడంతో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. వికారాబాద్ జిల్లాలోని.. రంగాపూర్, న్యామత్ నగర్, బసినపల్లి నగరాలలో… భూ ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. మొదటిసారి భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో భయంతో అందరూ కంగారు పడగా… ఏం జరుగుతుందో తెలియని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. మళ్లీ భూ ప్రకంపనలు వస్తాయేమో అనే భయంతో దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు ప్రజలందరూ కూడా ఇళ్ల బయటనే ఉండిపోయారు. కాగా రాష్ట్రంలో పడుతున్న వర్షాలకు అన్ని జిల్లాల ప్రజలందరూ ఇప్పటికే చాలా సమస్యలు ఎదుర్కొంటుండగా… ఇప్పుడు భూప్రకంపనల ద్వారా మరింత భయం నెలకొంది.
Read also : ఏంటి ఈ సినిమా!.. వార్-2 రివ్యూ, ఫ్యాన్స్ కు పూనకాలే