
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అర్ధరాత్రి భారీ వర్షాలు దంచి కొట్టాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అర్థరాత్రి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏడు జిల్లాలలో విపరీతమైన వర్షాలు దంచిపెట్టాయి. అవి…
1. అనకాపల్లి
2. ఏలూరు
3. పశ్చిమగోదావరి
4. ఎన్టీఆర్
5. కృష్ణ
6. పల్నాడు
7. నెల్లూరు
పైన పేర్కొన్న ఈ ఏడు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి కొన్ని జిల్లాలలో మోస్తారు వర్షాలు పడినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు ఉదయాన్నే పలు ప్రాంతాలలో మంచు కూడా ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల ఉదయాన్నే ముసురు వాతావరణం నెలకొంది. దీంతో ఉదయాన్నే ప్రయాణాలు చేస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళలేదని అధికారులు సూచించారు. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలను సూచిస్తూనే ఉన్నారు. కాగా ఈనెల చివర ఆఖరిలోపు ఈ వర్షాలు తగ్గుముఖము పడతాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
Read also : బిగ్ షాకింగ్ న్యూస్… ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న అమెరికన్లు
Read also : కోహ్లీ డక్ ఔట్… పీకల్లోతు కష్టాల్లో టీమిండియా!