క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఒకింత ఉపశమనం కలిగిస్తున్న మరోవైపు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు దాటికి ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు దంచికొడతాయి అని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.
నేడు వర్షాలు కురిసే జిల్లాలు
1.ఉమ్మడి ఆదిలాబాద్
2. హైదరాబాద్
3. నిజామాబాద్
4. ఖమ్మం
5. నల్గొండ
6. హైదరాబాద్
7. రంగారెడ్డి
8. మెదక్
9. మహబూబ్నగర్
పైన పేర్కొన్న ఈ తొమ్మిది జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని హైదరాబాద్ వాతావరణం శాఖ అధికారులు ప్రకటించారు. కాగా ఇప్పటికే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు కారణంగా ఎన్నో రకాల పంటలు విపరీతంగా నాశనమయ్యాయి. మరి ముఖ్యంగా తెలంగాణలో మామిడి పంటలు బాగా దెబ్బతిన్నాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగుమట్ల భూములు స్వాధీనం

