క్రైమ్ మిర్రర్, దేవరకొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణం వరదతో నిండిన పరిస్థితుల్లో కూడా దేవరకొండ కోర్టు సిబ్బంది తమ బాధ్యతల పట్ల అచంచలమైన నిబద్ధతను చూపించారు. పట్టణంలోని రహదారులు, కాలనీలు నీటమునిగినప్పటికీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.వి.ఎస్. హరీష్ బాబు నేతృత్వంలో కోర్టు సిబ్బంది సమయానికి కోర్టుకు హాజరై విధులు నిర్వహించారు.
Also Read:షాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు..!
భారీ వర్షం కారణంగా ప్రవేశ మార్గాలు మునిగిపోయినా, సేవా స్పూర్తితో ముందుకు వచ్చిన సిబ్బంది తమ హాజరుతో ప్రజాసేవ పట్ల ఉన్న కట్టుబాటును మరొక్కసారి చాటిచెప్పారు.
స్థానికులు ఈ ఘటనను ప్రశంసిస్తూ ఇంత ప్రతికూల వాతావరణంలో కూడా విధులను నిర్వర్తించడం నిజంగా ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. దేవరకొండ కోర్టు సిబ్బంది చూపిన ఈ క్రమశిక్షణ, విధి నిబద్ధత ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రేరణగా నిలిచింది.
Also Read:తుఫాన్ ఎఫెక్ట్… భారీ వాహనాలకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్





