
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ :- కామారెడ్డి జిల్లా వరద ప్రధాయిని అయిన నిజంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిజంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో సోమవారం ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తే అవకాశం ఉందని నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ ఏఈఈ సొలోమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….నిజంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం ఎగువ ప్రాంతాల నుండి 50,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని,ప్రాజెక్టు ప్రధాన గేట్లను రేపు అనగా(సోమవారం) ఏ సమయంలోనైనా నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి దిగువన గల మంజీర నదిలోకి నీటిని వదిలే అవకాశం ఉందని, కావున రెవెన్యూ,పోలీస్ శాఖ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. నదీ పరివాహక గ్రామాలలో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని,పశువుల కాపరులను,చేపలు పట్టే వారిని,రైతులను నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశించాలని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థా స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1400.90 అడుగులు ఉంది. 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 12.353 టీఎంసీలతో జలాశయం నిండుకుండలా ఉందని అన్నారు.
Read also : రాజగోపాల్ రెడ్డిపై చర్యల దిశగా కాంగ్రెస్… పిసిసి క్రమశిక్షణ కమిటీకి కీలక సమావేశం.!
Read also : వర్షాలే వర్షాలు.. తెలుగు రాష్ట్ర ప్రజల ఆందోళనలు ఇవే?