జాతీయంలైఫ్ స్టైల్

ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇవి పాటిస్తేనే?

క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ న్యూస్:-
“ఆరోగ్యమే మహాభాగ్యo” అని … కొంతమంది మహానుభావులు అంటూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా ఆరోగ్యానికి ఖర్చు పెట్టడమే సరిపోతుంది. ఇలాంటి తరుణంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం ఖచ్చితంగా అవుతుంది అని వైద్యనిపుణులు చెప్తున్నారు. శరీరంలోని ప్రతి భాగం కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనిషి బాగుంటాడు అని వైద్యులు సూచించారు. ఇందుకోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. లేక కష్టమైన పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అవ్వాలంటే ఖచ్చితంగా కింద చెప్తున్నటువంటి సూచనలు పాటించాలి.

1. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే నీరు త్రాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది.
2. మెదడు మరియు హార్మోన్లు చక్కగా పనిచేయాలంటే ప్రతిరోజు కోడిగుడ్లు తినండి
3. నడక మరియు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది
4. ప్రతిరోజు ఉదయం అల్లం నీరు త్రాగితే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది
5. ప్రతిరోజు సూర్యరశ్మిలో నిల్చోవడం వల్ల చర్మం కాంతివంతంగా ప్రకాశిస్తుంది.
6. రాత్రి నిద్రపోయేముందు పచ్చి వెల్లుల్లి తింటే టెస్టోస్టరాన్ పెరుగుతుంది.

కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఆరు సూచనలు పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యకరంగా ఉంటారు అని వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు. అనవసరంగా డాక్టర్ల దగ్గరికి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా.. ప్రతిరోజు ఈ చిన్న పనులు చేస్తూ ఉంటే మీ ఆరోగ్యం లో ఎటువంటి ఇబ్బందులు రావని వైద్యులు చెబుతున్నారు. మానవుడు ఎటువంటి అనారోగ్యపు పాలు కాకుండా ఉండాలంటే కచ్చితంగా ఇవి పాటించాలని హెచ్చరిస్తున్నారు.

Read also : దీపావళి వేళ కూటమి ప్రభుత్వంపై బాంబు పేల్చిన జగన్..!

Read also : నిజామాబాద్‌లో రియాజ్ ఎన్‌కౌంటర్.. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుకు ముగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button