ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

ఉద్యోగం కోసం పక్కా ప్లాన్ చేసాడు.. నాన్నని చంపాడు.. కానీ వర్కౌట్ అవ్వలేదు?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఈ కలికాలంలో ఎన్నెన్నో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సొంత కుటుంబంలోని మనుషుల్ని కన్నవారే చంపుకుంటుంటే ఇది కలికాలం కాక ఇంకేం అవుతుంది. నవ మాసాలు కడుపులో తల్లి పెంచుకుంటూ వస్తే.. తరువాత నుంచి పెళ్లి చేసేంతవరకు కూడా తండ్రి బాధ్యత తీసుకుంటాడు. కానీ తాజాగా ఒక వ్యక్తి కడుపు కక్కుర్తి కోసం నిట్ట నిలువునా తండ్రి ప్రాణాన్ని తీసేస్తాడు. ఇంతటి దారుణాలని మనం ఈ మధ్య చాలానే చూసాం. అయితే ఉద్యోగం కోసం తండ్రిని చంపిన వార్త ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారు మ్రోగుతుంది. ఇక అసలు వివరాలు లోకి వెళ్తే… కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం, పులకుర్తి గ్రామం కి చెందిన రామాచారి, విరూపాక్షమ్మ ఇద్దరు భార్య భర్తలు. వీరికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. కొడుకు పేరు వీరస్వామి. ఇతని దాదాపు డిగ్రీ వరకు కష్టార్జితంతో తండ్రి చదివించాడు. ప్రతిరోజు కూడా తండ్రి రామాచారి ఆర్టీసీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే ఇద్దరు బిడ్డలకు చక్కగా పెళ్లిళ్లు చేశారు.

Read also : బీహార్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, సీట్ల పంపకాలపై షా చర్చలు!

కానీ కొడుకు వీరస్వామి జులాయిగా తిరుగుతూ పెళ్లయినా కూడా భార్యల్ని పోషించలేక తిక్క తిక్క వేషాలు పడుతూ ఉండేవాడు. బతకడం చేతకాని వీరస్వామి.. ఎన్నో రకాలుగా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఒకరోజు మీ నాన్న చనిపోతే ఆ గవర్నమెంట్ ఉద్యోగం నీకే వస్తుంది అని ఎవరో వీరస్వామికి చెప్పారు. ఇక అంతే.. ఇంకేముంది నేరుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి బుధవారం రాత్రి తండ్రి పై గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటలు మీరడంతో… వీరస్వామి ముందుగానే ప్లాన్ చేసినట్లు తండ్రిని రోకలిబండతో తలపై బలంగా కొట్టడంతో తండ్రి రామాచారి ఒక దెబ్బకే కుప్పకూలిపోయి మృతి చెందాడు. వెంటనే ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరికి జాబ్ కాదు కదా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించారు… పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా ప్రజలతో పాటుగా తెలుగు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మరీ ఉద్యోగం కోసం కన్నతండ్రిని చంపేస్తారా అని చర్చించుకుంటున్నారు.

Read also : జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన కాంగ్రెస్ సీనియర్ చిదంబరం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button