
క్రైమ్ మిర్రర్,వైరల్ న్యూస్:- సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా కొన్ని వందల రకాల వీడియోలు అలాగే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని విషయాలు కొందరినీ ఇన్స్పిరేషన్ కు గురి చేస్తే మరికొన్ని మనసుకు గుచ్చే విధంగా ఉంటాయి. కానీ తాజాగా ఒక యువకుడు చేసినటువంటి పోస్టు ప్రతి ఒక్కరిని ఒకసారి ఆలోచింపజేసేలా, ఆశ్చర్యపోయేలా చేసింది. పెళ్లికి సంబంధించి తనకు కట్నం వద్దు కానీ నన్ను పెళ్లి చేసుకోబోయేటువంటి వధువు 10 కండిషన్లకు ఓకే చెప్పాలి అని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు.
ఆ 10 కండిషన్లు ఇవే
1. ప్రీ వెడ్డింగ్ షూట్ చేయకూడదు
2. పెళ్లిలో లెహంగా బదులు చీరలు మాత్రమే ధరించాలి
3. సాంప్రదాయ సంగీతం ఉండాలి
4. ప్రశాంతంగా దండలు మార్చుకోవాలి
5. పూజారి మంత్రాలను ఎవరు ఆపకూడదు
6. ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ జోక్యం అసలు ఉండకూడదు
7. ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి ఫోజులు పెట్టకూడదు
8. వేదికపై కిస్సెస్ మరియు హగ్స్ లాంటివి చేసుకోకూడదు
9. పగటిపూటే పెళ్లి జరగాలి
10. సాయంత్రం లోపు అప్పగింతలు పూర్తి చేయాలి.
ప్రస్తుతం అతను వధువుకు పెట్టినటువంటి కండిషన్స్ కొంతమందిని ఆలోచింప చేస్తుంటే మరికొందరికి మాత్రము ఇవేం వింత కండిషన్లు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా అతను కట్నం వద్దన్నాడు చూడండి ఆ విషయం మాత్రం మెచ్చుకోవాల్సిందే అని మరి కొంతమంది హాట్సాఫ్ చెబుతున్నారు.
Read also : వైసీపీ ఒక ఫేక్ పార్టీ .. ఈ మాట ఊరికే అనట్లేదు : మంత్రి లోకేష్
Read also : బంద్ కొనసాగుతున్న ప్రభుత్వం స్పందించట్లేదు : చైర్మన్ రమేష్ నాయుడు





