
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలంటే ఏకైక మార్గం లాటరీ. లాటరీ ద్వారా రాత్రికి రాత్రే ఎంతోమంది పేదవారు కూడా ధనికులైన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు ప్రతిరోజు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా రాజస్థాన్ లోని ఓ వ్యక్తి తన ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని మరి లాటరీ కొన్నాడు. ఇక అసలు వివరాలు లోకి వెళ్తే… రాజస్థాన్ కు చెందినటువంటి కూరగాయల వ్యాపారి ” పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ-2025 “లో.. 11 కోట్ల రూపాయలను గెలుచుకున్నారు. అయితే ఈ లాటరీ కొనడానికి అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో అతని ఫ్రెండ్ దగ్గర 1000 రూపాయలు అప్పుగా తీసుకొని లాటరీ కొన్నాడు. ఆ లాటరీని అతనికి 11 కోట్ల రూపాయలను తెచ్చి పెట్టింది. అయితే లాటరీ గెలవడానికి ముఖ్య కారణం తన ఫ్రెండ్ ఇచ్చిన ₹1000 కావడంతో అతనికి 11 కోట్లలో నుంచి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. ఇక మిగతా డబ్బు అంతటినీ కూడా సొంత ఇల్లు, పిల్లల విద్యా, భవిష్యత్తు కోసం వాడుతాను అని మీడియా వేదికగా తెలిపాడు. అయితే తోటి మిత్రుడికి గెలిచిన తర్వాత తన వెయ్యి రూపాయలు తనకి ఇవ్వకుండా.. గెలిచిన వాటిలో ఏకంగా కోటి రూపాయలను బహుమతిగా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అని అతనిని ప్రశంసిస్తున్నారు.
Read also : ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. రంగం సిద్ధం!.. వేదికలు ఇవే?
Read also : వేములపల్లిలో దారుణం…. విషపు ఆహారం తిని 100కు పైగా గొర్రెలు మృతి





