
కాళేశ్వరం కమిషన్ నోటీసులతో బీఆర్‌ఎస్‌లో భయం మొదలైందా…? కేసీఆర్-హరీష్‌రావు భేటీలో ఏం చర్చించారు..? గండం నుంచి బయటపడేయమని… కేసీఆర్‌ను హరీష్ వేడుకున్నారా…? అసలు కమిషన్ విచారణకు కేసీఆర్, హరీష్‌రావు హాజరవుతారా…? సాకులు చెప్పి తప్పించుకుంటారా..? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ కాక రేపుతోంది. ఇప్పటికే అధికారులను, ఇంజనీర్లను, కాంట్రాక్ట్ సంస్థలను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్… వారు ఇచ్చిన సమాచారంతో అప్పటి సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఆర్థిక మంత్రి ఈటలకు నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులతో బీఆర్‌ఎస్‌లో భయం మొదలైనట్టు తెలుస్తోంది. విచారణను ఎదుర్కొంటాం… తామేమీ తప్పు చేయలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైకి ధీమాగా చెప్తున్నా… హరీష్‌రావులో మాత్రం కంగారు మొదలైనట్టు తెలుస్తోంది. నోటీసుల వార్త రాగానే… హుటాహుటిగా.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు హరీష్‌రావు. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ గండం నుంచి బయటపడేదెలా అని… మామతో హరీష్‌రావు మంతనాలు జరిపినట్టు సమాచారం. దాదాపు అరగంటకుపైగా వీరిద్దరూ చర్చించుకున్నారు.
నోటీసులపై ఎలా స్పందించాలి..? విచారణకు హాజరవ్వాలా లేదా…? అన్న అంశంపై కేసీఆర్, హరీష్‌రావు మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వతే స్పందించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైతే ఏమవుతుంది…? ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అన్న అంశాలపై కూడా చర్చించనట్టు తెలుస్తోంది. న్యాయ సలహా తీసుకున్న తర్వాత.. మరోసారి సమావేశం కావాలని కూడా డిసైడ్ అయ్యారట.
ఇక.. అప్పటి ఆర్ధిక మంత్రి ఈటలకు కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపింది. అయితే.. తనకు నోటీసులు అందలేదని ఈటల అంటున్నారు. నోటీసులు అందితే పార్టీలో చర్చించి… అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తానన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అన్నారు ఈటల.