తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడీగా సాగుతున్నాయి. ఫార్మూలా ఈ రేస్ తో పాటు ధరణి, రైతు భరోసాపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. అవుటర్ రింగ్ రోడ్డు లీజు రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేయడం చర్చగా మారింది. హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. అవుటర్ రింగ్ రోడ్డు లీజుపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఇరికించాలని హరీష్ రావు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
హరీష్ రావు కి బీఆర్ఎస్ లో ఎక్కువ రోజులు నిలబడాలని లేనట్లుందని యెన్నెం అన్నారు. ఆయన ఏ చర్చ పెట్టిన బీఆర్ఎస్ కు నష్టం జరిగే విధంగా ప్లాన్ చేస్తుండు..ఆయనకు కావాల్సింది కేటిఆర్ బ్రష్టు పట్టాలని అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ పూర్తిగా పూర్తిగా ఆగం అయితే తాను పగ్గాలు చేపట్టొచ్చని హరీష్ రావు అనుకుంటున్నారని చెప్పారు. కెసిఆర్ అసెంబ్లీకి రాడని నిర్దారణ కావడంతో ఆ సీటు కోసం కేటీఆర్, హరీష్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుందన్నారు యెన్నం.
ఒక కుటుంబం చేసిన తప్పులను సవరించడానికి తాము ఉన్నామన్నారు. ధరణి పేరుతో లక్షల ఎకరాల భూములు ఒకే కుటుంబం కోసం దోచుకున్నారని అక్బరుద్దీన్ అన్నారని చెప్పారు. బీఆర్ఎస్ కచరా పార్టీ అని అక్బరుద్దీన్ అన్నారని.. Lkg పిల్లలకు ఉన్న జ్ఞానం బీఆర్ఎస్ సభ్యులకు లేదన్నారు.