
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సీనియర్ ప్లేయర్ లలో చాలామంది ప్లేయర్లు కూడా తడబడుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్య మాత్రం తన విశ్వరూపాన్ని ఈ టోర్నీలో కూడా చూపిస్తున్నారు. ఈ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభమైన మొదటి రోజు మ్యాచ్ లోనే ఏకంగా సెంచరీ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. బరోడా జట్టులో ఆల్ రౌండర్ గా ఉన్నటువంటి హార్థిక్ పాండ్యా మొన్న జరిగినటువంటి చండీగఢ్ పై మ్యాచ్ లో విధ్వంసాన్ని సృష్టించాడు. మొదట 19 బంతుల్లోనే ఆప్ సెంచరీ చేసినటువంటి హార్దిక్ పాండ్యా ఆ తరువాత కేవలం 12 బంతుల్లోనే 25 పరుగులు చేసి మొత్తంగా 31 బంతుల్లో 75 పరుగులు చేశారు. ఇందులో తొమ్మిది సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఇక ఈ జట్టు లోనే ఉన్నటువంటి మిగతా ప్లేయర్లు ప్రియాంష్ (113), విష్ణు (54), జితేష్ శర్మ 73 పరుగులతో రాణించడంతో బరుడ జట్టు టోటల్ గా 391 పరుగులు చేసింది. అనంతరం చేదనకు దిగినటువంటి చండీగఢ్ 242 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 149 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. చండీగఢ్ జట్టులో శివం సెంచరీతో రాణించినా కూడా ఫలితం లేకపోయింది. ఇలా ప్రతి మ్యాచ్ లోను హార్థిక్ పాండ్యా తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేస్తూ తన పవర్ను చూపిస్తున్నారు. ఇదే జోష్లో టి20 వరల్డ్ కప్ అలాగే వన్డే వరల్డ్ కప్ లో కూడా రాణించాలి అని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Read also : ప్రభుత్వ పాఠశాల ముగ్గుల పోటీలో సర్పంచ్ కూతురు ప్రతిభ.
Read also : పలువురికి ఆదర్శంగా పెద్దగూడెం సర్పంచ్ పోశం రమణమ్మ కోటిరెడ్డి





