
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ జిల్లాలోని నయీమ్ నగర్ లో ఉన్నటువంటి ఓ కాలేజీ లో శివాని అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు శివాని ఒక లెటర్ రాసింది. ఈ చదువు నాకు అర్థం కావట్లేదు అని ఆత్మహత్య చేసుకుంది. చనిపోతున్న చివరి క్షణాల్లో రాసిన లేఖను చూసి చదివిన ప్రతి ఒక్కరి కంట్లో నీరు వస్తుంది. అసలు విషయానికి వస్తే… హనుమకొండ జిల్లాలోని నయీమ్ నగర్ లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ కాలేజీలో శివాని అనే 16 సంవత్సరాల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు శివాని ఒక లేఖ రాసింది. ఈ లేఖలోని ప్రతి అక్షరం కూడా ప్రతి ఒక్కరి మనసును ద్రవింపజేస్తుంది. పిల్లలకు వారికి నచ్చిన చదువును చదివించండి. వారు చెబుతున్న ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా వినండి అంటూ లేఖలో రాసుకొచ్చింది.
Read also : ఒక వైపుకు వంగిన స్తంభం… పొంచి ఉన్న ప్రమాదం
బలవంతపు చదువుల వల్ల చిన్నారులు చాలా ఒత్తిడికి గురవుతున్నారో లేదో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని కోరింది. నాలా అర్థం కాని చదువు వద్దు… వాళ్లకు నచ్చిన చదువు వాళ్లని చదువుకోనివ్వండి. చెల్లి నువ్వు మంచిగా చదువుకో అని… నీకు నచ్చిన చదివే బాగా చదువుకో.. అని ఆ లెటర్ లో ఉంది. హాస్టల్లో ఎవరూ లేని సమయంలో శివాని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తమ కూతురు ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని శివాని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
Read also : ఒక వైపుకు వంగిన స్తంభం… పొంచి ఉన్న ప్రమాదం