Homeతెలంగాణగూడెం ప్రజలకు పల్లె వెలుగు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్సీ

గూడెం ప్రజలకు పల్లె వెలుగు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్సీ

• బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్సీ సత్యం
• కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం మండలం లింగవారి గూడెం గ్రామానికి గత కొన్ని నెలల నుండి బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్సీ వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం రోజు బస్సు సౌకర్యాలు కమ్యూనిస్టు నాయకులతో గ్రామస్థులతో కలిసి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా మునుగోడు నుండి లింగవారిగూడెం వరకు ఎమ్మెల్సీ బస్సులో ప్రయాణం చేశారు.. కొంపెల్లి పాఠశాలకు వెళ్లే విద్యార్థులు మాకు ఉదయం బస్సు లేక అనేక ఇబ్బందులు పడ్డామని బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా మాకు పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందుల లేకుండా చేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింగవారిగూడెం గ్రామస్తులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఆర్టిసి డిఎం ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. తదనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రకృతి ఒడిలో హోళీ.. రసాయన రంగులకు స్వస్తి పలుకుదాం

నేటికీ అందని రైతు భరోసా, పంట రుణమాఫీ..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు