
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- రైతులు వేరుశెనగ సాగు చేయాలి అని జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ అన్నారు. మండలములోని పులిపలుపుల రైతు వేదికలో ఆహార నూనెలకు జాతీయ యంత్రాంగం పథకంలో భాగంగా 100% సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలను జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ప్రభుత్వము అందిస్తున్న వేరుశనగ విత్తనాలను రైతులు తప్పనిసరిగా సాగు చేయాలని తెలియజేశారు. కపాస్ కిసాన్ అనే యాప్ ను పత్తి పంట పండించే ప్రతి రైతు ఇన్స్టాల్ చేసుకోవాలని ,పత్తి అమ్ముకోవడానికి ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని మనకు దగ్గరలో ఉన్న పత్తి మిల్లులో అమ్ముకోవచ్చు అన్నారు.
స్లాట్ బుక్ తనిఖీ చేసుకొని పత్తి తీసుకు పోవాలి. అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాణ్యతా ప్రమాణాలను పాటించినట్లయితే పత్తి కి మంచి మద్దతు ధర పొందవచ్చు 8% తేమ ఉంటే 8110 రూ, ఒక క్వింటాలుకు 9% ఉంటే 8028 రూ ,10% ఉంటే 7947 రూ ,11% ఉంటే 7866 రూ ,12% ఉంటే 7785 రూ ఒక క్వింటాలకు పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు బి వేణుగోపాల్, వ్యవసాయ అధికారి పద్మజ , మల్లేష్ , వ్యవసాయ విస్తరణ అధికారులు మాధగొని నరసింహ గౌడ్, వహీద్, యాదగిరి, నిఖిల్, వెంకటేష్ చండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి రైతులు పాల్గొన్నారు.
Read also : మైండ్ బ్లోయింగ్ వర్మా… నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా?
Read also : వాళ్ళిద్దరు ఆడుతారని గ్యారంటీ అయితే ఇవ్వలేను : గౌతమ్ గంభీర్