Homeఅంతర్జాతీయంహార్మూజ్‌లో భార‌త నౌక‌లకు గ్రీన్ సిగ్నల్‌...ఇరాన్ అధికారులు ట్వీట్‌...!

హార్మూజ్‌లో భార‌త నౌక‌లకు గ్రీన్ సిగ్నల్‌…ఇరాన్ అధికారులు ట్వీట్‌…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ప‌శ్చిమాసియా లో రోజు రోజుకు యుద్దం తీవ్ర పెరుగుతున్న వేళ హ‌ర్మూజ్ జ‌ల సంధిలో భార‌త నౌక‌ల్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. ఇజ్రాయెల్‌, అమెరికా యుద్దం కార‌ణంగా హ‌ర్మూజ్ జ‌ల‌సంధి ప్ర‌చంచం దృష్టిని త‌న‌వైపు తిప్పుకుంది. ఈ సంద‌ర్భంగా భార‌త భ‌ద్ర‌త‌పై ఇరాన్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ భారత నౌకలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.

భారత మిత్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తెలిపింది. హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైంది. ప్రపంచంలో సుమారు 20 శాతం చమురు రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతోంది.ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో నౌకల రాకపోకలపై పరిమితులు విధించారుఅయితే భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ వంటి స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలకు మాత్రం అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

ఈ నిర్ణయం వల్ల భారత్కు కొంత ఊరట లభించినట్లైంది.ఇప్పటివరకు ఎనిమిది భారత నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు సమాచారం. వాటిలో రెండు ఎల్పీజీ క్యారియర్లు ఉన్నాయి. ఈ నౌకల ద్వారా సుమారు 94 వేల టన్నుల ఎల్పీజీ భారత్కు చేరింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments