*క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి ప్రతినిది:* నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలం పరిదిలోని అన్ని గ్రామాల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచుల, ఉప సర్పంచుల, వార్డు మెంబర్లు సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్బంగా పాములపహాడ్ గ్రామా పంచాయతి 02వ వార్డు మెంబర్ దామెర్ల అశోక్ ప్రమాణ స్వీకార అనంతరం క్రైమ్ మిర్రర్ ప్రతినిది తో మాట్లాడారు..
నా ప్రియమైన పాములపహాడ్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. పాములపహాడ్ గ్రామం 02వ వార్డు ప్రజల ఆశీర్వాదాలతో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ శుభసమయంలో, నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018 ఆత్మకు అనుగుణంగా ప్రజాసేవే నా ప్రధాన ధ్యేయంగా పని చేస్తాను. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా 02వ వార్డు ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావిస్తూ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారులు, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై నిరంతరం కృషి చేస్తాను అన్నారు.
గ్రామ సర్పంచ్ కునుకుంట్ల అంజయ్య యాదవ్ నాయకత్వంలో, గ్రామపంచాయతీతో సమన్వయంగా పనిచేస్తూ, పాములపహాడ్ గ్రామ అభివృద్ధికి నా వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను. మీ అందరి సహకారం నాకు బలంగా నిలుస్తుంది ధన్యవాదాలు అని అన్నారు.





