Homeతెలంగాణసేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య,జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు.ముందుగా జయంతి వేడుకల సందర్భంగా బోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించి అనంతరం సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు,ఆర్డీవో కృష్ణ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. బంజరాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయంలను కాపాడిన మహానీయుడు,గిరిజనులను అహింస వైపు నడిపిన మహనీయుడు సేవ సత్యం సమానత్వం విలువలను బోధిస్తూ బంజరాల ఐక్యతకు సేవాలాల్ కృషిచేసారన్నారు.

43 కోట్ల ధాన్యం కుంభకోణం.. దంపతుల అరెస్ట్

Telangana: భారీగా IAS అధికారుల బదిలీలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు