ఆంధ్ర ప్రదేశ్సినిమా

“హరిహర వీరమల్లు” సినిమా టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈనెల 24వ తేదీన థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ మన ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సమాచారం అందింది. టికెట్ రేట్ల విషయంలో కొన్ని కీలక సూచనలు చేసింది. హరిహర వీరమల్లు సింగిల్ స్క్రీన్ లో లోయర్ క్లాస్ రూ. 100, అప్పర్ క్లాస్ రూ 150, అదే మల్టీప్లెక్స్లలో ఏకంగా 200 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని తెలిపింది. అయితే ఇక్కడ ఈ సినిమాకు ఒక షరతు విధించింది. కేవలం పదే పది రోజులపాటు మాత్రమే టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవచ్చని ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు ఈనెల 23వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం అందింది.
35 డ్రోన్ల కెమెరాలతో ఒంగోలు మొత్తం నిఘా!..
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు పలు సినిమాలను ఆపివేశారు. అందులో ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా పూర్తి దశలో ఉండగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడ ఈ సినిమాని పూర్తి చేసి నేడు విడుదలకు సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుంది. కాగా ఈ సినిమా జులై 24వ తేదీన ఘనంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. దాదాపు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబోతుండడంతో… పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా చాలా ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు. థియేటర్ల వద్ద ఇప్పటినుంచి బ్యానర్లతో తెగ సందడి చేస్తున్నారు.

ఆగని భార్య చేతిలో భర్త మరణాలు… నేడు మరో ఘటన..చాలా విచిత్రం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button