
GOOD NEWS: ఉద్యోగుల భవిష్య భద్రతకు కీలకంగా నిలిచే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఈపీఎఫ్ఓ సభ్యుల పీఎఫ్ ఖాతాల్లో వార్షిక వడ్డీ మొత్తాన్ని అదనపు చెల్లింపుగా జమ చేయనుంది. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా ఈ వడ్డీ మొత్తం మారనుంది. కొన్ని సందర్భాల్లో పీఎఫ్ ఖాతాలో దాదాపు రూ.46,000 వరకు జమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ వడ్డీ మొత్తం ప్రతి ఉద్యోగికి ఒకేలా ఉండదు. వ్యక్తిగతంగా పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని బట్టి వడ్డీ పెరుగుతుందో, తగ్గుతుందో నిర్ణయించబడుతుంది. అధిక బ్యాలెన్స్ ఉన్న ఉద్యోగుల ఖాతాల్లో ఎక్కువ వడ్డీ జమయ్యే అవకాశం ఉండగా, తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తక్కువ మొత్తం జమ అవుతుంది. ఈ వడ్డీ నిజంగా ఖాతాలో జమ అయిందో లేదో ఉద్యోగులు సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ బ్యాలెన్స్‌పై ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లించనుంది. ప్రతి సంవత్సరం పీఎఫ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ ప్రకటిస్తుంది. ఆ రేటు ప్రకారమే సభ్యుల ఖాతాల్లో వడ్డీ లెక్కించి జమ చేస్తారు. ఈ విధానం వల్ల లక్షలాది ఉద్యోగులకు ఇది ఆర్థికంగా ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఈ ఏడాది ఈపీఎఫ్ఓ 8.25 శాతం వడ్డీ రేటును అమలు చేయనుంది. ఈ రేటు ప్రకారం చాలా మంది ఉద్యోగుల ఖాతాల్లో రూ.46,000 లేదా అంతకంటే తక్కువ మొత్తం వడ్డీగా జమ కావచ్చని అంచనా. ఇప్పటికే వడ్డీ జమ ప్రక్రియపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త వడ్డీ రేటు ఎంత ఉంటుందన్న అంశంపై సభ్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ ద్వారా లేదా ఉమాంగ్ యాప్ ద్వారా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో కొన్ని నిమిషాల్లోనే పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకుని తాజా బ్యాలెన్స్‌ను తెలుసుకునే వీలుంది.
ALSO READ: రీల్స్ కోసం విద్యార్థినులపై వేధింపులు.. సగం గుండు కొట్టించి ఊరేగించారు





