ఆంధ్ర ప్రదేశ్

కేంద్రం గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పేదలు గ్రామాల్లో ఇల్లు లేకుండా ఉంటారో.. వారందరికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే… గ్రామాల్లో స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వము అదిరిపోయే న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ పథకం దరఖాస్తు గడువును పొడిగించింది. ఇటీవల నవంబర్ 5వ తేదీన ఈ దరఖాస్తు గడువు ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో.. అధికారుల విజ్ఞప్తి మేరకు ఈనెల 31వ తేదీ వరకు కూడా ఈ పథకం దరఖాస్తు గడువును పొడిగించింది. ఇక ఈ లబ్ధిదారుల ఎంపికను కేంద్రం ఆవాస్ యాప్ లో చేపడుతుంది అని అధికారులు వెల్లడించారు. ఎవరైతే ఈ పథకానికి అర్హులవుతారో వారందరూ కూడా సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహాయంతో యాప్ లో నమోదు చేసుకోవచ్చని కీలక ప్రకటన చేశారు. కాగా డబ్బు లేని వారు ఇల్లు కట్టుకోవడానికి కష్టమవుతున్న సందర్భంలో ఈ పథకం ద్వారా ఏకంగా 2.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది అని అధికారులు తెలిపారు.

Read also : అమ్మో చలి వచ్చేసిందోచ్.. ఇక జాగ్రత్తగా ఉండండి!

Read also : నేడే చివరి టీ20.. జట్టులో కీలక మార్పులకు అవకాశం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button