
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టీమిండియా యువ కెప్టెన్ గిల్ తిరిగి మళ్ళీ జట్టులోకి రానున్నారు. భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హట్ గా వెను తిరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా మెడ నొప్పితో బాధపడుతున్న గిల్ కోల్కొని తిరిగి భారత జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయి అని.. ఎల్లుండి జరగబోయేటువంటి రెండవ టెస్టులో ఆడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గోవాహటి చేరుకునే ప్లేయర్లతో పాటు కెప్టెన్ గిల్ కూడా ప్రయాణిస్తున్నాడు అని క్రీడా వర్గాలు తెలిపాయి. అయితే రెండవ టెస్టు మ్యాచ్ లో గిల్ ఆడే అవకాశాలు 50-50 అని స్పష్టం చేశారు. కాగా తొలి టెస్ట్ లో భారత్ పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించగా టీమిండియా అత్యల్ప స్కోర్ ను చేజింగ్ చేయలేక కుప్పకూలింది. దీంతో టీమిండియా చాలా ఏళ్ల తర్వాత ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. దీంతో రెండవ టెస్టు మ్యాచ్ లో గిల్ జట్టులో భాగమైతే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మరింత బలపడుతుంది. ఒకవేళ శుభమన్ గిల్ జట్టులో లేకపోతే మాత్రం కొంచెం తడపడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మొదటి టెస్టుల్లో ఓడిపోయిన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది.
Read also : Life Stages: 20లో స్కిల్స్, 30లో స్థిరత్వం, 40లో ప్రశాంతత..
Read also : Couple Relationship: మహిళల్లో తగ్గుతున్న లైంగిక ఆసక్తులు.. కారణమిదే





