
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బంగారం, వెండి ప్రియులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. మనదేశంలో బంగారం, వెండి ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ప్రతిరోజు కూడా వీటి ధరలు పెరగడమే చూశాం. కానీ మొట్టమొదటిసారిగా బంగారం అలాగే వెండి ధరలు భారీగా తగ్గాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి పై ఏకంగా 13000 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర 1,90,000 గా ఉంది. అలాగే మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1910 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 1,30860 రూపాయలు గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1750 రూపాయలు తగ్గి 196950 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా ఈ ధరలు తగ్గాయని మార్కెట్లు చెప్తున్నాయి. అయితే బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణం ధన త్రయోదశి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు ఉన్నట్లుగా సమాచారం అందింది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ బంగారం, వెండి కొనడానికి మాత్రం నానాతిప్పలు పడుతున్నారు. ధనవంతులు ఇంకా ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే పేదవాళ్ళు మాత్రం బంగారం ధరలు వింటూ కాలాన్ని గడుపుతున్నారు. ఏది ఏమైనా కూడా ఏకంగా కేజీ వెండిపోయి నేడు 13000 రూపాయలు తగ్గడంతో ప్రజలు బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
Read also : K- RAMP ఆడించిందిగా… డబుల్ మీనింగ్స్ మైనస్
Read also : <a style="color:red"
href=”https://crimemirror.com/australia-series-under-threat-of-rain-who-is-it-good-for/”>వర్షపు ముప్పులో ఆస్ట్రేలియా సిరీస్.. ఎవరికి అనుకూలం?