
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కళాకారుడికి త్వరలోనే ప్రత్యేక పింఛన్లు అందజేస్తామని మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. కాగా గత వైసీపీ ప్రభుత్వం లో కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లకు జత చేసి కళాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వైసీపీ ప్రభుత్వం పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే నంది నాటుకోత్సవాలు లాంటివి నిర్వహించి ఉగాది, కళా రత్న వంటి పురస్కారాలు ఖచ్చితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే ప్రతి ఒక్క కళాకారుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని తాజాగా జరిగినటువంటి ఓ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్రంలోని కళాకారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా ఇప్పటికే సాధారణ పింఛన్లకు ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలోనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగడంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది అని తెలిపారు.
Read also : బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు బంద్ చేస్తాం..!
Read also : మ్యాచ్ అనంతరం కన్నీరు పెట్టిన స్మృతి మందాన..!
Read also : సీఎం సెటైర్లకే సెటైర్ వేసిన వైసీపీ… ఎందులోనంటే?