తెలంగాణ

అల్లు అర్జున్ కి గుడ్ న్యూస్!.. కానీ దేశం వదిలి వెళితే కఠిన చర్యలు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : పుష్ప2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ దగ్గర డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై గత నెల 30వ తేదీన వాదనలు పూర్తి కాగా శుక్రవారం ఈ పిటిషన్‌పై నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు అదనపు న్యాయమూర్తి వినోద్‌ కుమార్‌ తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఉండగా తాజాగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్‌ ఇచ్చింది.

కరోనాను మించిన కొత్త వైరస్.. లక్షల్లో కేసులు.. భారత్ లో హై అలెర్ట్

హత్య, హత్యకు సూత్రధారిగా అల్లు అర్జున్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవంటూ తాము చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్‌ మంజూరు చేసిందని ఆయన తరపు న్యాయవాది అశోక్‌ రెడ్డి తెలిపారు.పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం ఈ కేసులో అల్లు అర్జున్‌పై మోపిన బీఎన్‌ఎ్‌సలోని 105వ సెక్షన్‌ వర్తించదంటూ తాము వినిపించిన వాదనలను కోర్టు విశ్వసించిందని ఆయన చెప్పారు. కాగా, పోలీసులు పూర్తి చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు అల్లు అర్జున్‌ ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది.

ఇకపై దేవాలయాలలో విజయ నెయ్యి మాత్రమే వాడాలి: తెలంగాణ ప్రభుత్వం

న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలిపింది. రూ.50 వేల విలువ గల రెండు పూచీకత్తులు సమర్పించాలని షరతుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను, ఘటనతో సంబంధమున్న సాక్షులను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్‌కు సూచించింది.

గేమ్ చేంజెర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్!.. ఇక దబిడి దిబిడే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button