
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం అంటే ఇష్టం లేనివారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. నిరుపేదలకు కూడా బంగారం అంటే చాలా ఇష్టం అయినప్పటికీ కూడా వాటిని కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యం లేక అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఈరోజుల్లో బంగారానికి మరియు వెండి కి డిమాండ్ అనేది ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మరొక సంచలన విషయాన్ని వెల్లడించింది. రాబోయే ఏడాది అనగా 2026వ సంవత్సరంలోనూ కూడా బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది.
Read also : నెగిటివ్ కామెంట్స్ చాలా బాధనిపించాయి.. ఇంటర్వ్యూలోనే ఏడ్చేసిన ఉప్పెన హీరోయిన్!
ఆర్థిక అస్థిరతా మరియు భౌగోళిక రాజకీయ నిశ్చితి కారణంగా ఈ బంగారానికి డిమాండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని పేర్కొంది. అలాగే ఈ బంగారాన్ని సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోలు చేయడం, గోల్డ్ రీసైక్లింగ్ యాక్టివిటీలు అలాగే బంగారాన్ని ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ నెల వరకు కూడా ఏకంగా 60 శాతం పెరుగుదల కనబరిచింది. దీంతో రాబోయే ఏడాదిలోను బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పటి ఇప్పటినుంచి బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటే భవిష్యత్తులో వాటి ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Read also : Terrible: నడిరోడ్డుపై కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి చంపారు





