
Gold and Silver Rates Today: బంగారం ధర మళ్లీ లక్ష రూపాయులు దాటింది. నిన్న మొన్నటి వరకు 98 వేలు పలికిన తులం బంగారం.. ఇవాళ లక్షకు చేరింది. ఇవాళ ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1, 00, 040కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91, 700 పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇవాళ ఉదయం ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 00, 190కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 91, 850 పలుకుంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,040కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 91,700 పలుకుంది. అటు వెండి ధరలకు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,000గా పలుకుతోంది. కోల్ కతా, ముంబై, బెంగళూరు సహా పలు నగరాల్లో రూ.1, 16,000 పలుకుతోంది.
అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా సుంకాల భయంతో బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వీటి మీద పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.