
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత ఆడపిల్లల చదువును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మగ పిల్లల్ని ఎక్కువగా చదివిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆడపిల్లల చదువును కావాలనే తల్లిదండ్రులు ఆపేస్తున్నారు అని అన్నారు. మగ పిల్లల ఉన్నత చదువు కోసం ఎంత అప్పునైనా చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపి మరీ చదివిస్తున్నారు కానీ ఆడపిల్లల విషయానికి వస్తే మాత్రం నిర్మొహమాటంగా తక్కువ వయసులోనే ఆపేస్తున్నారు అని కవిత అన్నారు. తాజాగా విద్య వ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత.. ఆడపిల్లల చదువు విషయంపై కొన్ని సూచనలు చేశారు. ఆడపిల్లల చదువు చాలా డెలికేటెడ్ సమస్యగా మారిపోయింది అని… కొంచెం దూరం బస్సు లేకపోయినా.. లేదా వీధి దీపాలు లేకపోయినా ఆడపిల్లల చదువును వెంటనే ఆపేస్తున్నారు అని… తల్లిదండ్రులు ఆడపిల్లల చదువుల పట్ల ఒకసారి ఆలోచించాలని కోరారు. కేవలం బాలికల కోసం విద్యా, ఉద్యోగాలకు సంబంధించి సపరేట్ విధానం అమలు చేయాలని… అప్పుడే తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం వస్తుంది అని తెలిపారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుత కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏవైనా కూలి పనులకు లేదా మంచి ఉద్యోగం ఉన్నటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. దీంతో ఉన్నత చదువులు చదివి దేశానికి ఉపయోగపడాల్సినటువంటి మహిళ యువతులందరూ కూడా ఇలా మధ్యలోనే పెళ్లిళ్లు చేసుకొని ఇంటికి పరిమితమవుతున్నారు అని చాలామంది కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు కన్న కలలు, లక్ష్యాలను చేరుకోలేక పోయామన్న బాధ ఇప్పటికీ చాలామందిలో ఉంటుంది అని అంటున్నారు.
Read also : పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారు అనడం దారుణం.. : సిపిఐ కార్యదర్శి
Read also : ఏందయ్యా ఇంత ఘోరమా.. టెస్టుల్లో అతి చెత్త రికార్డు మనదే!





