
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత జట్టు ప్రస్తుతం అన్ని ఫార్మేట్ లలో దూసుకుపోతూ ఉంది. ఒకప్పుడు ధోని, తరువాత విరాట్ కోహ్లీ, నిన్నటి వరకు రోహిత్ శర్మ.. ఇలా ప్రతి ఒక్కరు కూడా భారత క్రికెట్ టీం ను మూడు ఫార్మాట్ లలో చాలా బాగా విజయం సాధిస్తూ రాణించారు. భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఎంజాయ్ చేసేలా.. క్రికెట్ ను అంతగా ఆస్వాదించనిచ్చారు. మరి ప్రస్తుతం కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇక అన్ని ఫార్మాట్లకు వరుసగా రిటైర్మెంట్ ప్రకటిస్తుండడంతో… త్వరలోనే ఓడిఐ కెప్టెన్గా శుభమన్ గిల్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ సోషల్ మీడియాలో బాగానే వార్తలు వస్తున్నాయి. త్వరలో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కు గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తారని వార్తలు చాలానే వస్తున్నాయి. అలాగే t20 వైస్ కెప్టెన్సీ ని కూడా అప్పగిస్తారని చాలానే ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గిల్ టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వన్డే కెప్టెన్సీ కూడా గిల్ కి ఇవ్వాలని వార్తలు వస్తున్న విషయంలో బీసీసీఐ.. ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో చర్చలు జరిపినట్లు సమాచారం.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే గతంలో రోహిత్ వచ్చే 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడుతానని… అది గెలిచి తీరాలని అప్పుడే మీడియా వేదికగా చెప్పారు. కానీ ప్రస్తుతం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పిస్తారని వార్తలు వస్తుండడంతో రోహిత్ శర్మ అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. హిట్ మాన్ గా పేరుపొందిన రోహిత్ శర్మ ఎన్నో కప్పులను గెలిచారు. ఒంటి చేతితో మ్యాచును గెలిపించగల సత్తా కూడా రోహిత్ శర్మకు ఉంది. దాదాపు 24 ఐసీసీ వైట్ బాల్ మ్యాచ్ లకు కెప్టెన్సీ చేసిన రోహిత్ శర్మ 23 మ్యాచ్లో భారతదేశాన్ని గెలిపించాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ సగటు 54 గా ఉంది. కెప్టెన్షన్ నుంచి తప్పించాలని వస్తున్న వార్తలు పై రోహిత్ శర్మ అభిమానులు అలాగే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా మంది రోహిత్ శర్మని కంటిన్యూ చేయాలని బీసీసీఐకి సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి టైం లో మీరు రోహిత్ శర్మ లేదా గిల్ కు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందో అనేది మీ అభిప్రాయం తెలియజేయండి.
తల్లి కావాలని ఉంది.. కానీ చాలా భయం అంటున్న స్టార్ హీరోయిన్!
ప్రైవేటు సంస్థకు గ్రామ పంచాయతీ స్థలాలు! రేవంత్ సర్కార్ మరో బాంబ్