క్రైమ్ మిర్రర్,తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్-2025’ చలన చిత్ర అవార్డులను శనివారం (మార్చి 7, 2026) ప్రకటించింది. పాత ‘నంది’ అవార్డుల స్థానంలో ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ప్రవేశపెట్టిన ఈ పురస్కారాల్లో సినీ దిగ్గజాలకు మరియు చిన్న చిత్రాలకు పెద్దపీట వేశారు.
ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకను మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించనుంది.
లెజెండరీ గౌరవ పురస్కారాలు…
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం: మెగాస్టార్ చిరంజీవి
పైడి జయరాజ్ అవార్డు: లోకనాయకుడు కమల్ హాసన్
ఏఎన్నార్ (ANR) అవార్డు: సహజ నటి జయసుధ
బి.ఎన్. రెడ్డి అవార్డు: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: నిర్మాత అశ్వినీదత్
కాంతారావు అవార్డు: ఆర్. నారాయణమూర్తి
రఘుపతి వెంకయ్య అవార్డు: రమేష్ ప్రసాద్
సినారె (C. నారాయణ రెడ్డి) అవార్డు: గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
ప్రధాన విభాగాల్లో విజేతలు….
ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్ సినిమాకు)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు)
ఉత్తమ దర్శకుడు: సాయిలు
ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: అనిల్ రావిపూడి
