జాతీయం

మకరజ్యోతి ఆరంభం !… శబరిమళలో భారీ బందోబస్తి?

మకర సంక్రమణ సమయంలో కాంతమలైగా పిలిచే పొన్నంబలమేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే హరిహర పుత్రుడు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు శబరికొండకు తరలివస్తున్నారు. 1999లో హిల్‌టాప్‌ తొక్కిసలాట, 2011లో పులిమేడ్‌ దుర్ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మకరవిళక్కు(జ్యోతిదర్శనం) రోజున భారీ బందోబస్తుకు కేరళ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న భద్రతకు తోడు అదనంగా 5 వేల మందిని మోహరించనుంది.

మరోసారి వెనకడుగు వేసిన ఇస్రో!… కారణం ఏంటంటే?

మకరవిళక్కు సీజన్‌ ప్రశాంతంగా ముగిసేందుకు పలు ప్రాంతాల్లో వాహనాలు, భక్తులకు నిషేధాజ్ఞలు విధించినట్లు పథనంతిట్ట కలెక్టర్‌ ఎస్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.హైకోర్టు ఆదేశాలతో ఈ సారి పంపాబేస్‌, హిల్‌టాప్‌ వద్ద పార్కింగ్‌కు అనుమతించినా.. మకరవిళక్కు నేపథ్యంలో హిల్‌టా్‌పలో వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. ఆ స్థానంలో సుమారు 8 వేల మంది భక్తులు హిల్‌టాప్‌ నుంచి మకరజ్యోతిని దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. మకరజ్యోతి దర్శనానికి ఈ సారి అయ్యన్నమల వ్యూపాయింట్‌లో ఎవరినీ అనుమతించరు.

టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా యశస్వి జైస్వాల్?

పందళం నుంచి శబరిమలకు తిరువాభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లే మార్గంలో ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. మకరజ్యోతి అనంతరం భక్తులు నీలక్కల్‌కు తిరిగి వెళ్లేలా కేఎ్‌సఆర్టీసీకి చెందిన 300 బస్సులు అందుబాటులో ఉంటాయి. అయ్యప్ప దర్శనం పూర్తయిన భక్తులు మకరజ్యోతి కోసం సన్నిధానంలో ఉండకుండా వాటికీ సంబంధిత వ్యూపాయింట్లకు తరలిస్తారు. అక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. గతం లో జరిగిన తప్పులు జరగకుండా ఇపుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మహా కుంభమేళా ప్రారంభం.. ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది జనం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button