
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ తరుణంలో చాలామంది కూడా అల్లు అర్జున్ ని చూడాలని కళలు కంటున్నారు. ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన అభిమానులను నేరుగా కలవాలి అని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. తాజాగా హైదరాబాదులో పలువురు అభిమానులను కలిసిన అల్లు అర్జున్.. ఇతర నగరాల్లో కూడా ఇలానే అభిమానులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు అని సిని వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా వీటికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేసారని తెలుస్తోంది. పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ కు ఒక సపరేట్ ఆర్మీ ఉంది అని కొన్ని సందర్భాల్లో వినే ఉంటాము. ఇక త్వరలోనే అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా రాబోతుంది. దాదాపు ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగానే ఉంటుందని సినిమా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్తో తీస్తున్నటువంటి సినిమా ద్వారా మరో కొత్త ప్రపంచం చూడబోతున్నారు అని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూపులు చూస్తున్నారు. అల్లు అర్జున్ అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఫ్యాన్స్ ను కలవాలని అల్లు అర్జున్ కూడా తహతహలాడుతున్నట్లుగా అర్థమవుతుంది. దీంతోనే ఫ్యాన్స్ ను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే మరోవైపు అల్లు అర్జున్ ఇలా మీటింగ్లు పెట్టి ఫాన్స్ ని కలవాలని కోరుకుంటే మరోసారి తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Read also : అకాల వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యం.. లబోదిబో మంటున్న రైతన్నలు
Read also : లేచిన వెంటనే అలసట, కంటి చూపు మందగించినట్లు అనిపిస్తుందా?.. అయితే ప్రమాదమే!