
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీనిపట్ల మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మెల్లిగా ఒక్కొక్కటి నెరవేర్చుతూ వస్తుంది. నిన్న ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి పథకం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రమంతటా కూడా ఫ్రీ బస్ సర్వీసులను ప్రారంభించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి ముఖ్య నాయకులు బస్ స్టేషన్ కు వెళ్లి అమలయిందో లేదో పరిశీలించారు.
Read also : తెలంగాణలో మార్వాడీల వ్యాపారాలపై వ్యతిరేక ఆందోళనలు తీవ్రం
బస్సుల్లో ఎక్కినటువంటి మహిళలతో ఈ పథకం గురించి మాట్లాడి చర్చించారు. ఒక్కొక్క కుటుంబానికి వారానికి 800 రూపాయలు చొప్పున పొదుపు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలోని ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉచిత బస్సు పథకం ను దగ్గరుండి మరీ ప్రారంభించారు. అయితే ఈ ఉచిత బస్సు పథకం మహిళలకు మాత్రమే కావడంతో రాష్ట్రంలోని పురుషులు కొంతమంది వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మంచిదే కానీ పురుషుల పరిస్థితి ఏంటి అని చాలామంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది పురుషులకు కూడా ఏదో ఒక పథకాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇంకొంతమంది మొత్తం మహిళలకు ఉచిత బస్సు ఇవ్వకుండా కేవలం వృద్ధులకు మాత్రమే ఇస్తే సరిపోయేది అని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : మేడిగడ్డ బ్యారేజ్ కి వరద ఉధృతి