
ప్రకాశం జిల్లాలో ఘరానా మోసం… సోషల్ మీడియాతో జరభద్రం
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఒక మహిళ ట్రేడింగ్ అంటూ ఒక వ్యక్తి దగ్గర ఏకంగా 1.16 కోట్లు దొబ్బేసింది. దీంతో చివరికి బాధితుడు పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు అసలు విషయం తెలపగా.. ప్రస్తుతం ఈ విషయం జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇక అసలు వివరాలు లోకి వెళ్తే… ప్రకాశం జిల్లా, కనిగిరి లో ఒక బైక్ షోరూం కి చెందిన యజమానికి గత కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ ద్వారా ఒక యువతి పరిచయమైంది. ప్రతిరోజు కూడా ఆ యువతీ ఫేస్బుక్ ద్వారా అతనితో చాటింగ్ చేస్తూ నమ్మిస్తూ వచ్చింది. ఇక చివరికి ఆ మాట ఈ మాట చెప్పి.. ట్రేడింగ్ యాప్ వైపు మొగ్గు చూపేలా చేసింది. ఆ యువతీ ఎలా చెప్తే అలా నమ్మి ట్రేడింగ్ లో లాభాలు వస్తాయని అనుకోని 1.6 కోట్లు ఆమెకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ యజమానికి ఆ యువతి ఫేస్బుక్ బ్లాక్ చేసిన సంఘటన ఎదురయింది. దీంతో మోసపోయానని గమనించిన ఆ యజమాని వెంటనే కనిగిరి సర్కిల్ ఆఫీస్ పోలీసులను ఆశ్రయించగా దీనిపై కేసు నమోదు చేసుకొని… విచారణ చేపడతామని తెలిపారు. ఈమధ్య ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయని… తద్వారా ప్రజలందరూ కూడా ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు.
Read also : ఈ కొన్ని పనులు చేస్తే రోజంతా ఉత్సాహమే..!
Read also : తెలంగాణలో పోటీ చేయటం లేదు.. సీఎం కీలక నిర్ణయం!