క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన రేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఉదయం 10 గంటల సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తన లీగల్ టీంను పోలీసులు లోపలికి అనుమంతించకపోవటంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తాను న్యాయవాదితో విచారణకు హాజరవుతానని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం తన స్టేట్‌మెంట్‌ను రాతపూర్వకంగా ఏఎస్పీకి ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also : వెల్‌కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్.. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా ఫ్యాబ్రికేట్ చేశారని… ఈ కేసులోనూ అలాగే జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాను లాయర్లతో విచారణకు హాజరవుతానంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దాంతో పాటుగా.. సర్కార్‌పై మరో సంచలన ఆరోపణ చేశారు. తాను ఏసీబీ విచారణకు హాజరు కాగానే.. తన ఇంటిపై రైడ్స్ చేయించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేసారని కేటీఆర్ ఆరోపించారు. పోలీసులతో తన ఇంట్లో లేనిపోని ఆధారాలు పెట్టి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రైతు భరోసా నిధుల తగ్గింపు తదితర అంశాలను పక్కదారి పట్టేందుకు తనకు ఏసీబీ చేత నోటీసులు జారీ చేయించారని చెప్పారు.
Also Read : ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించిన తెలంగాణ యువకుడు !.. కానీ ప్రభుత్వం నుండి నో సపోర్ట్?
ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని.. తనకు తెలిసిన అన్ని వివరాలు ఇది వరకే కోర్టుకు చెప్పినట్లు తెలిపారు. కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈ డ్రామాలు ఎందుకని మండిపడ్డారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను తప్పబట్టడానికి ఏం లేదని చెప్పారు. కొత్తగా తన నుంచి ఏసీబీ వివరాలు సేకరించేది ఏమీ లేదని.. ఇప్పటికే అన్ని వివరాలు ప్రభుత్వం వద్దనే ఉన్నాయని అన్నారు. తాను నిజాయితీగానే ఉన్నానని.. ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. రైతు భరోసాను డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏసీబీ ఆఫీసు ఎదుట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా.. పలువురు నేతలను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి :