తెలంగాణ

కాంగ్రెస్ నేతలను తరిమికొట్టండి.. కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అంటే మోసం,దగా,నయవంచన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేతిలో రైతులు మోసపోతున్నారని చెప్పారు. రైతులకు,కౌలు రైతులకు 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.. డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారు..కైని రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలని చెప్పారు. రైతు రుణమాఫీ,రైతు బంధుకు లక్ష కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రైతుబందుగా నిలిస్తే..రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారని అన్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని రేవంత్ రెడ్డి అన్నారు..సీఎం పదవిలో కూర్చొని రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పిఆర్సీ,డీఏ ఇచ్చింది బిఆర్ఎస్ కాదా అని నిలదీశారు.

Read Also : త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌.. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితినినాశనం చేసింది రేవంత్ రెడ్డి..హైడ్రా,మూసీతో రియల్ ఎస్టేట్ పడిపోయింది..సంవత్సరంలో లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు పంచారు.. మీరు పైసలు ఢిల్లీకి మూటలు పంపుతున్నరా అని నిలదీశారు. దివాళా తీసిందిరేవంత్ రెడ్డి మెదడు.. రూ. 5,943కోట్ల రెవిన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించాం..రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు అబద్ధం మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు,మండల కేంద్రాలు,నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతామని చెప్పారు. హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే దానిపై క్లారిటీ లేదన్నారు. ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసేప్రయత్నం చేస్తున్నారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. రైతు బంధు పధకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలని.. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపిచ్చారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ, కొత్త పేర్లు ప్రతిపాదన
  2. మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు!!
  3. భారత్‌లో తొలి HMPV కేసు..?.. 8 నెలల చిన్నారికి సోకినట్లు నిర్ధారణ!!
  4. ప్రారంభమైన హైడ్రా గ్రీవెన్స్.. స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్ రంగానాథ్
Back to top button