
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ న్యూస్ :-గుండెపోటు కారణంగా గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ నిన్న అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. నిన్న రాత్రి సమయంలో రవి నాయక్ కు గుండెపోటు రాగా అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి సుమారుగా ఒంటిగంట సమయంలో మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో గోవాలో మంచి పేరు, గుర్తింపు ఉన్నటువంటి రవి నాయక్ మృతి పట్ల చాలామంది సంతాపం తెలియజేస్తున్నారు. చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇవ్వాళ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే రవి నాయక్ మృతి పట్ల పీఎం మోడీతో సహా పలు ముఖ్య నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవి నాయక్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటినుంచి తన జీవితం మొత్తం కూడా ప్రజాసేవకు అంకితం చేశారని పలువురు ప్రశంసిస్తున్నారు. ఏ పదవిలో ఉన్నా కూడా సామాన్య ప్రజలతో చాలా మంచి ప్రవర్తనతో పలకరిస్తూ ప్రజా సేవలు చేస్తుంటారని మరి కొంతమంది ప్రశంసిస్తున్నారు. గోవాలో ఒక మంచి రాజకీయ నేతను కోల్పోయామని పలువురు సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు.
Read also : దీపావళికి టీవీల్లో ప్రసారం కానున్న డివోషనల్ మూవీ..!
Read also : 18న గ్రూప్–2 నియామక పత్రాల వేడుక.. ముఖ్య అతిధిగా సీఎం