తెలంగాణ

కొడంగల్ అల్లర్లు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం అరెస్ట్

కొడంగల్ లో జరిగిన ఫార్మా రగడ.. జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. సీఎం సొంత గడ్డలో కలెక్టర్ పై దాడి చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కఠిన చర్యలకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

వికారాబాద్ జిల్లాలోని సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో జరిగిన ఫార్మా రగడ.. జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. సీఎం సొంత గడ్డలో కలెక్టర్ పై దాడి చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, కడా స్పెషల్ ఆఫీసర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త. పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే సురేష్ రైతులను ఉసిగొల్పి కలెక్టర్ పై దాడి చేయించారని పోలీసులు గుర్తించారు. దాడి జరిగిన రోజుల నిందితుడు సురేష్.. 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారని పోలీసులు గుర్తించారు. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

వికారాబాద్‌ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 16 మందిని అరెస్ట్‌ చేసి నిన్న అర్ధరాత్రి కొడంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. వారికి మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించగా.. పరిగి సబ్‌జైలుకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లోకి వందల మంది పోలీసులు వచ్చి ముందుగా విద్యుత్‌ సరఫరా, ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు.

అనంతరం ఇళ్లలోకి దూసుకెళ్లి.. కొందరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులైన 50 మందిని పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి సీసీ ఫుటేజీలు, వీడియోలు పరిశీలించి విచారించారు. అనంతరం దాడి ఘటనతో సంబంధం లేని 34 మందిని విడిచిపెట్టారు. మిగిలిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి, పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం అర్ధరాత్రి కొడంగల్‌ ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ శ్రీరామ్‌ ఎదుట హాజరు పర్చారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాలు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు

అధికారులపై దాడి గుండాల కుట్ర..దాడి ఘటనలో నిఘా విభాగాలు విఫలం.!

కొడంగల్ దాడుల వెనుక కేటీఆర్ హస్తం!

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button