
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆన్లైన్ డెలివరీ సంస్థల గోడౌన్లు పై తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో స్విగ్గి, జొమాటో మరియు జెప్టో వంటి ఆన్లైన్ డెలివరీ సంస్థలు హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై ఇలాంటి ప్రముఖ ముఖ్య నగరాలలో ప్రజలకు సులభంగా డెలివరీ చేస్తున్నారు. అయితే ప్రేక్షకులకు అందెటువంటి ఫుడ్ డెలివరీ ఏవైనా కూడా కొన్ని ఆన్లైన్ డెలివరీ సంస్థల నుంచి కొంతమందికి ఎక్స్పైర్ ఫుడ్ అందడంతో చాలామంది కూడా ఈ ఆన్లైన్ డెలివరీ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో.. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదులోని ఆన్లైన్ డెలివరీ సంస్థలైన 75 గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో చాలా ఎక్స్పైర్ అలాగే మిస్ బ్రాండెడ్ వస్తువులను గుర్తించి వాటిని వెంటనే సీజ్ చేశారు. మరోవైపు కుళ్ళిన ఫ్రూట్స్ అలాగే కుళ్ళిపోయిన కూరగాయలను గుర్తించి వాటిని వెంటనే పడి వేయాలని సూచించారు. మరికొన్ని వస్తువులు అసలు బ్రాండ్ గా లేక నాసిరకం వే అని శాంపిల్స్ తీసుకున్నారు. ఇందులో భాగంగానే రూల్స్ ను అతిక్రమించిన ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
Read also : 2028 ఎండాకాలంలోపు అమరావతి పూర్తి : సీఎం చంద్రబాబు
Read also : WHO: ఏ వయస్సు వారు ఎంత సేపు వ్యాయామం చేయాలంటే..?





