
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగింది. మేడిగడ్డ ఏడో బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి ఉంచారు. 85 గేట్లు ఎత్తి ఉండడంతో 3,10,080 క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతుంది. వరద ఉదృతంగా ప్రవహించడంతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అధికారులు బ్యారేజీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read also : తెలంగాణలో మార్వాడీల వ్యాపారాలపై వ్యతిరేక ఆందోళనలు తీవ్రం
Read also : తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు!.. ఎప్పటినుంచో మీకు తెలుసా?