- అపరిశుభ్రతకు ఆనవాలుగా రాందాస్ పల్లి ఎక్స్ రోడ్ లోని రాఘవేంద్ర హోటల్
- అయినా పట్టించుకోని మున్సిపల్ పారిశుద్ధ్య యంత్రాంగం
- హోటళ్లు, టిఫిన్ సెంటర్లను తక్షణమే తనిఖీ చేసి… తగిన చర్యలు తీసుకోవాలి
హోటల్లో ఈగల మోత మోగుతున్న యాజమాన్యం పట్టించుకోకుండా, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రామదాసు పల్లి ఎక్స్ రోడ్ లోని రాఘవేంద్ర హోటల్లో ఈగల మధ్య వినియోగదారులు టిఫిన్ చేస్తున్నారా? అన్న అనుమానం కలగకమానదు. అంతగా ఈ హోటల్లో ఈగలు ఉన్నప్పటికీ, హోటల్ యాజమాన్యం కనీస పరిశుభ్రత చేయని చేపట్టక పోవడం దారుణం. అపరిశుభ్రంగా మారిన హోటళ్ళ ను తనిఖీ చేయాల్సిన మున్సిపాలిటీ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడకపోవడం సిగ్గుచేటు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారు హోటల్ లో టిఫిన్ చేయాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి.
పరిశుభ్రతను పాటించాల్సిన హోటల్ యాజమాన్యం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి, ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించడం పట్ల పలువురు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని మున్సిపాలిటీ శానిటేషన్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన వారు స్పందించకపోవడం సిగ్గుచేటు. సమగ్ర కుల గణన చేపడుతున్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం క్షమించరాని నేరమని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కుల గణన చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఆదేశాలను జారీ చేసిందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి ..
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి