తెలంగాణసినిమా

సాయం అందినా కూడా మరణించిన ఫిష్ వెంకట్!.. అసలు కారణం ఇదే?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేడు కమెడియన్ గా మరియు విలన్ గా గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ మరణించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఫిష్ వెంకట్ చాలా రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో పోరాడుతూనే ఉన్నారు. తాజాగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రులు చేరిన ఫిష్ వెంకట్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయని… వెంటనే ఆపరేషన్ చేయాలని… వాటికి దాదాపుగా 50 లక్షల ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలిపారు. అయితే ఫిష్ వెంకట్ కూతురు… డాక్టర్ చెప్పినట్లుగానే ఆస్పత్రి ముందు మీడియాకు వివరణ ఇచ్చారు. ఇక వెంటనే ఆపరేషన్ చేయించడానికి మా దగ్గర అంత డబ్బు లేదని… ఎవరైనా సహాయం చేయాలని చెప్పేసి తన కూతురు అలాగే ఫిష్ వెంకట్ కుటుంబం కోరింది. ఈ సమాచారం బయటకు రాగానే ఎవరు కూడా అంతగా స్పందించలేదు. ఫిష్ వెంకట్ కుటుంబం చాలా మందిని ఆపరేషన్ కోసం డబ్బు సహాయం చేయాలని కోరారు.

అయితే సినిమా ఇండస్ట్రీ పరంగా చాలా రోజుల తర్వాత కొంతమంది యువ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆపరేషన్కు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఫిష్ వెంకట్ సన్నిహితులు మరియు తోటి నటులు కూడా ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఒకానొక సమయంలో ప్రభాస్ యాభై లక్షలు ఇస్తున్నట్లుగా చాలా ఫేక్ వార్తలు వచ్చాయి. కానీ ఏమైనా కూడా చివరికి ఆపరేషన్ కి డబ్బులు అందిన సమయంలో… ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. చివరి దశలో ఆర్థిక సాయం అందినా కూడా.. ఫిష్ వెంకట్ కు కిడ్నీ డొనేట్ చేసేవారు సరైన సమయంలో దొరకకపోవడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నిన్న సాయంత్రం మరణించారు. అయితే ఫిష్ వెంకట్ దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన కూడా ఆస్తులను మాత్రం సంపాదించుకోలేకపోయారు. మంచి సినిమా ఇండస్ట్రీలో బతికినా కూడా… పేదరికంలోనే ఫిష్ వెంకట్ మరణించారు. ఫిష్ వెంకట్ మరణించిన కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క ప్రముఖ నటులు కూడా అతనికి సంతాపం తెలియజేయకపోవడం అనేది అలా బాధాకరమైన విషయం.

ఈ నెంబర్ జెర్సీ ని ఎవరు ధరించిన ఊరుకోం.. వైభవ్ పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం!

అవినీతి విషయంలో… పురుషులే కాదు?.. మహిళలు కూడా తగ్గేదేలే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button