తెలంగాణ

తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. రెండు రోజులు స్కూల్లకు సెలవులు

క్రైమర్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగునున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగేటువంటి స్కూల్లకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆయా పాఠశాలలకు 10 మరియు 11వ తేదీలలో సెలవులు ప్రకటిస్తూ తాజాగా డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈసారి తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4236 గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే 10వ తేదీన పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల కారణంగా సెలవు ఇస్తుండగా 11వ తేదీ పోలింగ్ ఉండడంతో రెండు రోజులు పాటు సెలవులు ఇస్తున్నారు. అయితే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొననున్నారు అని అధికారులు ఇప్పటికే తెలిపారు.

Read also : ప్రతిపక్ష నేతలతో రాజకీయం చేయాలి అంటే సిగ్గుగా ఉంది : సీఎం

ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హవా కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది ఈసారి యువకులు పోటీల్లో నిల్చున్నారు. గ్రామాభివృద్ధికి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇక సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి నచ్చినట్లుగా హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇకపోతే మరోవైపు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్ బంద్ చేస్తున్నట్లు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఏది ఏమి చేసినప్పటికీ ఈరోజు సాయంత్రం నుంచి ప్రచారానికి బ్రేక్ పడునుంది.

Read also : ముగిసిన చర్చలు.. 12న “అఖండ-2” సినిమా విడుదల?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button