
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో ఇంటికి పరిమితమైన కేసీఆర్ చాలా రోజుల తర్వాత నిన్న రాజకీయ ప్రస్తావనలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగడుతూ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టునున్నట్లుగా కెసిఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల అవుతుంది.. ఇప్పటివరకు ఒక లెక్క… రేపటి నుంచి అందరి తాట తీస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల మధ్యన నిలబడి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలిపారు. ఇక ఇప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది అని కెసిఆర్ అన్నారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు అని.. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని అన్నారు.
Read also : Gang Rape: మైనర్ బాలికపై మృగాళ్ల కిరాతకం.. ఆటోలో తీసుకెళ్లి పదే పదే అత్యాచారం!
తాము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా అహంకారం ప్రదర్శించలేదు అని.. నన్ను తిట్టడం లేదా చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అని తీవ్రంగా విమర్శించారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై సెటైర్లు వేశారు. పెట్టుబడిదారుల సదస్సులు తన గురువు చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి హైప్ క్రియేట్ చేశారు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని భూములు రేట్లు కుప్పకూలిపోయాయని అన్నారు. గతంలో నాలుగు ఎకరాలు ఉన్నోళ్లు కూడా రెండు కోట్ల వరకు వస్తాయి అని శ్రీమంతుడులాగా బతికారు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎకరం అమ్ముదాం అన్న ఎవరు కొనే పరిస్థితిలో లేరు అని విమర్శించారు. ఏది ఏమైనా కూడా దాదాపు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ప్రత్యర్థులపై బాగానే విరుచుకుపడ్డారు.
Read also : SL vs IND: శ్రీలంతో ఫస్ట్ టీ20, దుమ్మురేపిన టీమిండియా!





