తెలంగాణ

అడ్డదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ.. ఒక్కో పోస్టుకు 20 లక్షలు !

తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఛైర్మన్ డా. మహిపాల్ యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో డా.మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో అడ్డదారుల్లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి అనేక తప్పిదాలు చేశారని, ఆ బాటలోనే ఈ ప్రభుత్వంలో ఉన్న కొంత మంది అధికారులు
ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

వారం రోజుల్లో మళ్లీ అడ్డదారుల్లో గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ తదితర శాఖలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సిద్దపడుతున్నట్టు మహిపాల్ యాదవ్ ఆరోపించారు.గతంలో అడ్డదారీలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల ద్వారా నియమించబడ్డ వాళ్లని తొలగించాలని..అలా అక్రమంగా నియమించిన వాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు.అర్హులైన వారిని మాత్రమే బ్యాక్ లాగ్ ఉద్యోగాలలో నియమించాలి.తమ ప్రధాన డిమాండ్ కూడా ఇదేనని ప్రభుత్వం వారం రోజుల్లో మళ్లీ అడ్డదారుల్లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ చేయాలనుకుంటున్న అధికారులను గుర్తించి వారిని అడ్డుకోవాలని హెచ్చరించాలి.అడ్డదారుల్లో బ్యాక్ లాగ్ ఉద్యోగం కొనాలి అనుకునే వారికి మీ డబ్బులు పోతాయి, మీ జాబులు పోతాయి, మీరు జైలుకు వెళ్తారని ప్రభుత్వం గట్టిగా హెచ్చరికలు జారీ చేయాలని మహిపాల్ యాదవ్ పేర్కొన్నారు.

Read More : కొత్తపేట విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో ఏసీబీ రైడ్స్ 

గత ప్రభుత్వంలో కూడా అడ్డదారిలో నిర్మల్ మున్సిపల్ లో ఏకంగా 44 పోస్టులు భర్తీ చేశారని మహిపాల్ యాదవ్ చెప్పారు. కొన్నిటిని బంధుప్రీతితో, కొన్నిటిని వేలం వేసి అమ్ముకున్నారని తెలిపారు. ఒక్కో జాబుకు 16 లక్షలకు వసూలు చేసినట్టు డాక్టర్ మహిపాల్ యాదవ్ ఆరోపించారు. గతంలో కెసిఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ కు తెలంగాణ జెన్ కో లో ఏఈ ఎగ్జామ్ రాయకుండానే ఆమెకు ఏఈ పోస్ట్ ను ఇచ్చిన సంగతిని మహిపాల్ గుర్తు చేశారు.

Spread the love
Back to top button