
పెబ్బేరు,క్రైమ్ మిర్రర్ :- పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని మహేష్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. షటర్ తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. కాష్ కౌంటర్ లో ఉన్న రూ.5 వేలు నగదు దొంగతనం చేసినట్లు యజమాని నీలం శంకర్ తెలిపారు. దొంగతనం చేసి అక్కడే ఉన్న కుండలో నీళ్లు తాగి, మూత్ర విసర్జన చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. షాప్ యజమాని నీలం శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Read also : చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. సెమీఫైనల్స్ లో అద్భుత విజయం
Read also : పెళ్లి పీటలు ఎక్కనున్న భారత స్టార్ మహిళా క్రికెటర్.. వరుడు ఇతడే?
Read also : అయ్యప్ప స్వాములు అలర్ట్.. శబరిమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం!
 
				 
					
 
						 
						




