Tuesday, February 24, 2026
Homeతెలంగాణహైడ్రా పేరుతో వసూళ్లు చేసినందుకే ఫిరోజ్ ఖాన్‌ను కొట్టాం..

హైడ్రా పేరుతో వసూళ్లు చేసినందుకే ఫిరోజ్ ఖాన్‌ను కొట్టాం..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత,నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ ఖాన్ తో పాటు అతని అనుచరులు దాడి చేయడం పాతబస్తీలో టెన్షన్ పుట్టించింది. ఫిరోజ్ ఖాన్ పై దాడి తర్వాత నాంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. అయితే ఫిరోజ్ ఖాన్ పై దాడిపై నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ ఖాన్ వివరణ ఇచ్చారు.

నాంపల్లి – సయ్యద్ నగర్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వసూళ్లకు పాల్పడుతున్నాడని మాజిద్ ఖాన్ ఆరోపించారు. అందుకే అతన్ని తాము అడ్డుకున్నామన్నారు. ఫిరోజ్ ఖాన్ ఇలాంటి వసూళ్లు చేస్తూ తిరిగితే చెప్పులతో కొడతామని ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ హెచ్చరించారు.

హైడ్రా పేరుతో బెదిరించి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు డబ్బులు అడుగుతున్నారని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని సయ్యద్ నగర్ మిలటరీ ఏరియాలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు వచ్చి హైడ్రా సర్వే పేరుతో బెదిరిస్తున్నారని.. డబ్బులు ఇస్తే సర్వే చేయమని లేదంటే సయ్యద్ నగర్ ప్రాంతం నుండి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని సయ్యద్ నగర్ ప్రాంత వాసులు ఆందోళన చేశారు.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments